ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గండికోట ఉత్సవాలను.. మంత్రి అవంతి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. 2 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాండ్ ఆర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గండికోట విశిష్టతను తెలియజేసే లేజర్ షో ఆకట్టుకుంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ బృందం నిర్వహించిన మ్యూజికల్ నైట్ అలరించింది. గాయకులు శ్రీకృష్ణ, సింహా తమ గాత్రంతో సందర్శకులను ఉర్రూతలూగించారు. యాంకర్, నటి హరితేజ నృత్యంతో ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గండికోట ఉత్సవాలకు జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్లను మంత్రులు అభినందించారు. గండికోట ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని... దానికోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చదవండి..