కడప నగరం నడిబొడ్డున ఉన్న ప్రకాష్ నగర్, మృత్యుంజయకుంట కాలనీలు సరైన కాలువలు లేక వర్షం నీరు ఇళ్ల మధ్యనే నిల్వ ఉంది. గత ఆరు నెలలుగా అలానే ఉండడంతో రంగుమారి దుర్వాసన వస్తోంది. దీంతో కొందరు ఇళ్లను ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. సొంత ఇళ్లు ఉన్నవారు, పేదలు మురుగునీటి మధ్యనే నివాసం ఉంటున్నారు. పారిశుద్ధ్యం లోపించడం, మురుగు నీరు నిల్వ ఉండడంతో విషపురుగుల సంచారం అధికమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: