కడప వీరస్వామి మండి వీధిలోని ఓ ప్లాస్టిక్ పైపుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. వెంకటరమణారెడ్డి అనేవ్యక్తి.. వీరస్వామి మండి వీధిలో 20 ఏళ్లుగా ప్లాస్టిక్ సామగ్రి దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణం తెరిచి మధ్యాహ్నం నుంచి తాళం వేసి ఇంటికి వెళ్లారు.
సాయంత్రం దుకాణంలో నుంచి పొగలు గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తాళాలు పగలగొట్టి మంటలు అదుపు చేశారు. అప్పటికే దుకాణంలోని సామాగ్రి దగ్ధమైంది. సుమారు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి:
'సాంకేతిక సదుపాయాలతో.. సిటీ కోర్టు కాంప్లెక్స్ భవనం నిర్మాణం'