ETV Bharat / city

PRC: పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల ధర్నా - ఉద్యోగులు

PRC: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. డీఏ బకాయిలు సహా పీఆర్సీని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశాయి.

p
p
author img

By

Published : Dec 16, 2021, 3:08 PM IST

పీఆర్సీ, డీఏ బకాయిలను చెల్లించాలని ఉద్యోగుల ధర్నా

PRC: పీఆర్సీ సహా డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేశాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్​ రద్దు చేస్తామన్న జగన్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

కడప జిల్లా రాయచోటిలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతమవుతుందని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో వివిధ సంఘాల నేతల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.

ఇదీ చదవండి: Amravati Sabha at Tirupati: రేపు 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'..చురుగ్గా ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.