కడప జిల్లాలో విద్యుత్ మీటర్స్ రీడర్స్ సంఘం ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసన చేపట్టారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్స్ కు పీస్ రేటు విధానాన్ని రద్దు చేసి శాశ్వత వేతనం ఇవ్వాలన్నారు. బిల్లింగ్ పని దినాలు, పీస్ రేటు తగ్గింపును ఉపసంహరించాలని కోరారు. మీటర్స్ రీడర్స్ కు 50 లక్షలు కరోనా బీమా ప్రకటించాలని తెలిపారు. ఏప్రిల్ వేతనాలు ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి కలాం పెట్టిన పేరు..కలకాలం నిలిచే తీరు