కడప జిల్లా గోపవరం ఈనాడు కంట్రిబ్యూటర్ కాతర్ల మాబు షరీఫ్ ఈరోజు తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో గుండెల్లో మంట రావడంతో కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించి ఆక్సిజన్ పెట్టారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్ళమని వైద్యుల సలహా ఇచ్చారు. ఈలోగా ఆకస్మికంగా మృతి చెందారు. ఈనాడు, ఈటీవీ-ఈటీవీ భారత్ కు వార్తలు అందిస్తూ చురుగ్గా పనిచేశారు.
ఇదీ చదవండి: కరోనా విలయతాండవం- కొత్తగా 52,050 కేసులు