Demolition of illegal constructions in Kadapa: కడపలో అక్రమ కట్టడాల కూల్చివేత పరంపర కొనసాగుతోంది. తాజాగా మృత్యుంజయ కుంటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవెన్యూ శాఖ, పోలీసు అధికారులు జేసీబీలతో వెళ్లగా.. స్థానికులు వారిని అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కట్టడాలను ఎలా తొలగిస్తారని స్థానికులు వాగ్వాదానికి దిగారు. అధికారులు ముందుకెళ్లకుండా జేసీబీ ముందు బైఠాయించారు. ఏళ్ల తరబడి ఉంటున్న తమ నివాసాలను కూల్చివేస్తే ఉన్నపలంగా ఎక్కడికెల్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు, నీటి పన్ను, ఇంటి పన్ను అన్నీ చెల్లి స్తున్నామని.. ఇప్పుడు అక్రమ కట్టడాలని ఎలా అంటారని ప్రశ్నించారు.
పోలీసులు, తహసీల్దార్ శివరాం రెడ్డి వచ్చి బాధితులతో మాట్లాడారు. మృత్యుంజయ కుంటలో అక్రమంగా నిర్మించిన ఓ కట్టడాన్ని తొలగించేందుకు వచ్చామని అధికారులు చెప్పడంతో స్థానికులు శాంతించారు. అయితే ఆ ఇంటి(అక్రమ కట్టడం) యజమానులు మాత్రం అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. నితిన్ చేగుంటలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని.. తన ఒక్క నివాసాన్ని మాత్రమే కూల్చివేయడం దారుణమని కన్నీరుమున్నీరుగా బాధితులు విలపించారు.
ఇవీ చదవండి: