కడపలో సీబీఐ: కడపలో మకాం వేసిన సీబీఐ అధికారులను నాలుగు రోజుల నుంచి వరుసగా కలిసి.. తనకు జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న దస్తగిరి.. గురువారం కూడా పులివెందులలో మీడియాతో మాట్లాడి.. మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల కళ్లెదుటే ఈ గొడవ జరిగినా తనకు అండగా నిలవలేదని దస్తగిరి వాపోయాడు. ఈ క్రమంలోనే వివేకా హత్యకేసును తనపై వేసుకుంటే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నాడంటూ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి.. రెండు నెలల కింద అనంతపురం జిల్లా యాడికిలో మృతి చెందాడు. సిట్ విచారణ సమయంలో సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి... ముఖ్యమంత్రివైఎస్. జగన్, ఆయన బంధువు వైఎస్. భాస్కర్‌రెడ్డికి లేఖలు రాసి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలన్నీ గుర్తుచేసుకుంటున్న దస్తగిరి... తనకు ప్రాణాపాయం తప్పదని ఆందోళన చెందుతున్నాడు.
ఎస్పీకి ఫిర్యాదు: ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలతో దస్తగిరి భయం మరింత పెరిగింది. ఈ నెల 2వ తేదీన పెంపుడు కుక్క అకస్మాత్తుగా చనిపోవడం, ఆ తర్వాత శునకం కొంటామంటూ ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటికి రావడం, మరుసటి రోజే గన్‌మెన్‌లను మార్చేయడం... దస్తగిరి భయానికి కారణమయ్యాయి. కుక్కను అమ్ముతామని ఎవరికీ చెప్పకపోయినా, ఆరుగురు వ్యక్తులు దానికోసం తమ ఇంటికి రావడం అనుమానాలకు తావిస్తోందని... దీనిపై విచారణ చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు ఎలాంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలని దస్తగిరి మరోసారి తేల్చిచెప్పాడు.
ఇవీ చదవండి: