కడప జిల్లాలోని 5 ప్రాంతాల్లో కోవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి యదుభూషణ్ రెడ్డి చెప్పారు. 2 వేల పడకలు అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. 2 రోజుల్లో బద్వేలులో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఇవన్నీ... మినీ కోవిడ్ ఆసుపత్రులుగా కోవిడ్ కేర్ సెంటర్లు పనిచేస్తాయని చెప్పారు. వీటి ద్వారా బాధితులకు అవసరమైన అన్ని వైద్య సేవలూ అందిస్తున్నట్లు వెల్లడించారు.
రోగుల పరిస్థితి విషమిస్తే కోవిడ్ ఆసుపత్రులకు వెంటనే తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ నెలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున బాధితుల తాకిడి పెరిగే అవకాశం ఉందని.. వాటిని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్న ఆయనతో.. మా ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చదవండి:
సోనూసూద్ ట్రస్ట్.. కరోనా బాధితుల పాలిట సంజీవిని
కాన్పు కోసం వెళ్లిన గర్భిణి మృతి.. వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆందోళన