ETV Bharat / city

Tulasi Reddy on Pawan: భాజపా చేతిలో పవన్​ 'కీలుబొమ్మ': తులసిరెడ్డి

author img

By

Published : Mar 15, 2022, 12:25 PM IST

Tulasi Reddy Comments: భాజపా చేతిలో పవన్‌ కీలుబొమ్మలా మారారని కాంగ్రెస్ సీనియర్​ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. డొంక తిరుగుడు రాజకీయాలు మానుకొని స్వశక్తితో ఎదగాలని హితవు పలికారు. సభా ప్రాంగణానికి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టి.. అదే సభలో కాంగ్రెస్ హఠావో అనడం, రాహుల్ గాంధీని విమర్శించడం అవివేకమన్నారు.

Tulasi reddy comments
భాజపా చేతిలో పవన్​ 'కీలుబొమ్మ' - తులసిరెడ్డి

Tulasi Reddy Comments: జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పవన్ కల్యాణ్​ ప్రసంగం పిట్టల దొర ప్రసంగంలా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి కడప జిల్లా వేంపల్లిలో అన్నారు. సభా ప్రాంగణానికి కాంగ్రెస్ నాయకులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకుని.. అదే సభలో కాంగ్రెస్ హఠావో అనడం, రాహుల్ గాంధీని విమర్శించడం అవివేకమన్నారు. చేస్తే స్వశక్తి రాజకీయాలు చేయాలి, లేకుంటే జనసేన పార్టీనీ భాజపాలో విలీనం చేయాలి. అంతేతప్ప డొంక తిరుగుడు రాజకీయాలు వద్దని జనసేన పార్టీని తులసిరెడ్డి హెచ్చరించారు.

భాజపా చేతిలో పవన్ కల్యాణ్​ కీలుబొమ్మ అని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి శనిగ్రహం, నెంబర్​వన్​ ద్రోహి భాజపా అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ భాజపా అని తులసి రెడ్డి ధ్వజమెత్తారు. భాజపా ఇచ్చే రోడ్​మ్యాప్​తో ముందుకుపోతానని పవన్ కల్యాణ్​ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:

పవన్​కల్యాణ్​ మాటలతో ఏకీభవిస్తున్నాం.. పొత్తులపై అధిష్టానానిదే నిర్ణయమన్న తెదేపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.