Tulasi Reddy on Amaravathi : రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ వాసులేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి అన్నారు. రాయలసీమ వాసులు రోడ్డు మార్గాన అమరావతికి పోవాలంటే 6 నుంచి 8 గంటలు పడుతుందని, కానీ.. విశాఖకు పోవాలంటే మరో ఎనిమిది గంటలు పడుతుందని తులసి రెడ్డి చెప్పారు.
ఇది రాయలసీమ ప్రజలకు అసౌకర్యం, ఆర్థిక భారమేనన్నారు. రాష్ట్ర సచివాలయాన్ని అమరావతిలోనే కొనసాగిస్తూనే మళ్లీ వికేంద్రీకరణ బిల్లు తేకుండానే రాయలసీమ మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చునని సూచించారు.
కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించి.. 13 జిల్లాలలో పరిశ్రమలు స్థాపించి.. అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చని వివరించారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని అమరావతిలోనే కొనసాగించాలని కోరారు. కడప జిల్లా వేంపల్లి మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి : Man in Burkha : అప్పు చేశాడు.. బురఖా ధరించాడు..!