ETV Bharat / city

ఇరు వర్గాల మధ్య స్థల వివాదం..ఘర్షణలో వ్యక్తి మృతి - kadapa latest crime news

స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కడపలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇరు వర్గాల మధ్య వివాదం... వ్యక్తి మృతి
ఇరు వర్గాల మధ్య వివాదం... వ్యక్తి మృతి
author img

By

Published : Jun 8, 2020, 2:17 PM IST

కడప మున్సిపల్​ స్టేడియంలో కూరగాయల దుకాణాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. లాక్​డౌన్​ కారణంగా ప్రభుత్వం కూరగాయల మార్కెట్​ను కడప మున్సిపల్ మైదానానికి మార్చారు. గత రెండు నెలల నుంచి అక్కడే కూరగాయలు విక్రయిస్తున్నారు.

షేక్​ మహమ్మద్ ఎజాజు అనే వ్యక్తి ఈ మైదానంలో ఉల్లిపాయల దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట సత్తార్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉల్లిపాయల వ్యాపారం ప్రారంభించాడు. సత్తార్​కు కావలసిన స్థలాన్ని షేక్ మహమ్మదే ఇచ్చాడు. అయితే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని సత్తార్​ను షేక్ మహమ్మద్ కోరాడు. కానీ అతను ఖాళీ చెయ్యలేదు. ఈ క్రమంలో షేక్ మహమ్మద్, సత్తార్ మధ్య వాగ్వాదం నెలకొని.. ఇరు వర్గాల ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో షేక్ మహమ్మద్​పై కర్రలతో దాడి చేయడంతో అతను కుప్పకూలాడు. వైద్యం నిమిత్తం వెంటనే రిమ్స్​కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు హత్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:శిరస్త్రాణం లేని సరదా ప్రయాణం... తీసింది ఇద్దరి ప్రాణం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.