కడప జిల్లా ముద్దనూరు నుంచి తాడిపత్రి వైపునకు బొగ్గు లారీ వెళ్తోంది. ముద్దనూరు మండలం కోడికాండ్ల పల్లె వద్ద ఎడమ వైపు వెళ్లాల్సిన లారీ... పాత రోడ్డు ద్వారా డ్రైవరు వాహనాన్ని పోనిచ్చాడు. గండికోట జలాశయం నీళ్లు రోడ్డును చుట్టుముట్టడంతో నేరుగా జలాల్లోకి లారీ వెళ్ళిపోయింది. డ్రైవరు, క్లీనరు లారీ పైకెక్కి ముద్దనూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి రోప్ సహాయంతో డ్రైవర్, క్లీనర్‌ను రక్షించారు. వివిధ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా ఎటువంటి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇదీ చదవండి: