ETV Bharat / city

YS Viveka Murder Case: వైఎస్​ వివేకా కేసు..అనుమానితుల ఇళ్లలో ఆయుధాలు స్వాధీనం - కడప జిల్లా పులివెందుల

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసులో అనుమానితులుగా ఉన్న పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఇంట్లో అవసరాలకు వాడే కొన్నిరకాల వస్తువులు, వ్యవసాయ పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కడపకు వచ్చి సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండవచ్చనే కోరణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

YS Viveka Murder Case
వైఎస్​ వివేకా కేసు
author img

By

Published : Aug 12, 2021, 5:39 AM IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ చేస్తున్న సీబీఐ.. కడప జిల్లా పులివెందులోని అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించి, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే అరెస్టైన సునీల్ యాదవ్ ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేసిన సీబీఐ అధికారులు.. వ్యవసాయానికి వాడే కత్తులు, కొడవళ్ళు సహా మరికొన్ని పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ యాదవ్ బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా కూడా వెంట తీసుకెళ్లారు. ఈ మేరకు పంచనామా నిర్వహించి, సునీల్ తండ్రికి వస్తువుల జాబితా అందజేశారు. అలాగే సునీల్ సొంతూరు మోటునూతనపల్లె, సునీల్ భార్య లక్ష్మి సొంతూరు వెన్నపూసపల్లిలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. దస్తగిరి ఇంట్లోనూ కొన్ని వ్యవసాయ పనిముట్లను, ఇంట్లో వాడే కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఇరికించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని.. సునీల్ కుటుంబసభ్యులు మరోసారి ఆరోపించారు.

వైఎస్​ వివేకా కేసు..అనుమానితుల ఇళ్లలో ఆయుధాలు స్వాధీనం

సుదీర్ఝ విచారణ..

పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వైఎస్ అభిషేక్‌రెడ్డిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హత్య జరిగిన రోజు మృతదేహానికి కుట్లు వేయడం, గాయాలకు కట్లు కట్టడం చేశారనే అభియోగాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక నుంచి 20 వాహనాల్లో వచ్చిన బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది.. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన వివరాలు అందజేశారు. కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులను కూడా సీబీఐ ప్రశ్నించింది. బెంగళూరులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్‌కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగాయనే అనుమానంతో... సీబీఐ అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కడపలో సీబీఐ అధికారులు కలిశారు. దర్యాప్తు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. మరికొందరు అనుమానితులను సీబీఐ ఇవాళ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ప్రేయసి కోసం.. ఆ పని చేశాడు.. చివరకు..!

MURDER: కాళ్లు చేతులు కట్టి.. చున్నీతో మెడను బిగించి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.