ETV Bharat / city

పాపాగ్ని నదిలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రాణాపాయం - కడప తాజా వార్తలు

Car plunged into river: వైఎస్సార్ జిల్లా కమలాపురం పాపాగ్ని నది అప్రోచ్ రోడ్ వద్ద కారు అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయింది. కారులో ఉన్న ముగ్గురు యువకులు క్షేమంగా బయటపడ్డారు. పీలేరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ముగ్గురు యువకులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు.

CAR
అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన కారు
author img

By

Published : Oct 11, 2022, 5:47 PM IST

Car plunged into River: వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పాపాగ్ని నది దగ్గర పెను ప్రమాదం తప్పింది. పాపాగ్ని బ్రిడ్జి వద్ద అప్రోచ్​ రోడ్డులో కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. పీలేరు నుంచి హైదరాబాద్​కు కారులో వెళుతున్న ముగ్గురు యువకులు దారి తెలియకపోవడంతో ఇర్కాం సర్కిల్ నుంచి కమలాపురం క్రాస్ రోడ్డుకు చేరుకుని అక్కడ ఎలా వెళ్లాలో తెలుసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో.. ముగ్గురు యువకులు క్షేమంగా బయటపడ్డారు. వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.