ETV Bharat / city

దుర్వాసన మధ్యే కాలం వెల్లదీస్తున్న బుగ్గవంక బాధితులు

నివర్ తుపాను మిగిల్చిన నష్టాలు కడప జిల్లా ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల బుగ్గవంక ప్రవాహానికి నిరాశ్రయులైన వారిని ఆదుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. కట్టుబట్టలతో నిలిచిన బాధితుల గోడు వర్ణనాతీతంగా మారింది. ఐదు రోజులు దాటినా...ఇళ్ల ముందు పేరుకుపోయిన బురద, చెత్తాచెదారం ఆందోళన కలిగిస్తోంది. దుర్వాసన మధ్యలో బుగ్గవంక బాధితులు కాలం వెళ్లదీస్తూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

దుర్గంధం మధ్యే కాలం వెల్లదీస్తున్న బుగ్గవంక బాధితులు

author img

By

Published : Dec 1, 2020, 10:24 PM IST

నివర్ తుపాను కారణంగా కడప నగరంలోని బుగ్గవంక ప్రవాహం సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా ప్రజలు కోలుకోలేదు. కడప నడిబొడ్డు నుంచి 19 వేల క్యూసెక్కుల బుగ్గవంక ప్రవాహం...రవీంద్రనగర్, నాగరాజుపేట, నభీకోట, గుర్రాలగడ్డ, బాలాజీనగర్, వైవీస్ట్రీట్, ఏడురోడ్ల కూడలి ప్రాంతాలను ముంచెత్తింది. ఫలితంగా పరివాహక ప్రాంతాల్లో వందల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కట్టుబట్టలతో బాధితులు రోడ్డునపడ్డారు. బుగ్గవంక ప్రవాహం తగ్గి ఐదు రోజులు దాటినా... బురదకష్టాలు మాత్రం ఇంకా తీరలేదు. ప్రతి ఇంటి ముందు నాలుగు అడుగుల మేర బురద పేరుకు పోయింది. ఇంట్లో సామగ్రి, బియ్యం బస్తాలు, ధాన్యం తడిసి ముద్దయ్యాయి.

మున్సిపాలిటీ అధికారులు చెత్తను తొలగిస్తారనే ఆశతో ఐదురోజుల నుంచి దుర్వాసన మధ్యనే జాగారం చేస్తున్నారు. కనీసం ఇంట్లో కూర్చోవడానికి కూడా వీలు లేని దయనీయ పరిస్థితి బాధితులకు ఎదురైంది. నాగరాజుపేట ప్రాంతంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వీధిలో నడవటానికి వీల్లేని విధంగా బురదమేటలు పేరుకుపోయాయి. బుగ్గవంకను ఆనుకుని ఉన్న పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కూలీనాలీ చేసుకుని ఇంట్లో దాచుకున్న డబ్బు, బంగారం, ధాన్యం బస్తాలు మొత్తం వంకపాలయ్యాయి. నాగరాజుపేటలో ఓ మహిళ తన కుమార్తె వివాహం కోసం దాచుకున్న 5 తులాల బంగారం, 350 కిలోల ధాన్యం బస్తాలు, 70 వేల నగదు వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

"సర్వస్వం కోల్పోయి నిలువనీడ లేకుండా కట్టుబట్టలతో మిగిలున్నాం. అంజాద్ బాషా సార్​కు ఫోన్ చేసినా...స్పందించటం లేదు. చనిపోయామా ? బతికున్నామా ? అనేది కూడా పట్టించుకోవటం లేదు. చివరకు మా శవాలను తీసుకెళ్లటానికైనా వస్తారా? అని అడిగాం. కాళ్లుపట్టుకుంటామన్నా...ఎవరు కనికరించటం లేదు."

-బాధితురాలు

ఓట్ల కోసం ప్రతి ఇంటికి వచ్చి దండం పెట్టే నాయకులు....ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎందుకు రావటం లేదని బాధితులు నిలదీస్తున్నారు. ఇరుకు గదుల్లో ఉన్న కుటుంబాలు, చిన్నచిన్న దుకాణాల నిర్వహకులు పిల్లాపాపలతో రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక...స్వచ్ఛంద సంస్థలు, దాతల ఇచ్చిన ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు. ఐదురోజుల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా...అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఒక్కొక్కరికి 500 రూపాయల సాయం ఈ కాలనీల్లో ఇంకా ప్రారంభించలేదు. 500 రూపాయలు ఏ మూలకు సరిపోతాయని..,ఇంట్లో నష్టపోయిన సామాగ్రికి ఎవరు బాధ్యత వహిస్తారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

"మెుత్తం సామాగ్రి నష్టపోయాం. బంగారం కోల్పోయాం. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. అధికారులకు మెురపెట్టుకున్నా...కనికరించటంలేదు. అంజాద్ బాషా సార్ ఫోన్ నెంబర్ సేకరించి ఫోన్ చేసినా స్పందన లేదు. అధికారులు నిర్లక్ష్యంగా బుగ్గవంక నీళ్లొదిలి మమ్మల్ని నిరాశ్రయులను చేశారు. ఓట్లు వేసేప్పుడు గడపగడపకు వచ్చే నేతలు ఇప్పడు ఎక్కడికెళ్లారు."

-బాధితురాలు

బాధ్యతారాహిత్యంతో బుగ్గవంక నుంచి నీటిని వదిలి పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకోవడానికి కారకులైన అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ వేదనను తీర్చాలని కోరుతున్నారు.

ఇదీచదవండి

ఇంటి కోసం పేదలకు కనీసం 2సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.