ETV Bharat / city

రక్తపాత గ్రామం... గబ్బిలాల రాకతో ప్రశాంత వాతావరణం..! - కడపలో గబ్బిలాలు తాజా వార్తలు

గబ్బిలం... ఈ పేరు వింటేనే చాలామంది అసహ్యించుకుంటారు. ఓ గ్రామంలో మాత్రం దేవతామూర్తిగా పూజిస్తున్నారు. దిష్టి తగలకుండా వాటి ఎముకలు ధరిస్తారు. మలాన్ని పిల్లల శరీరానికి పూస్తారు. 35 ఏళ్లుగా ఇదో ఆచారంలా కొనసాగుతోందక్కడ.

bat-gods
author img

By

Published : Nov 13, 2019, 12:38 PM IST

రక్తపాత గ్రామం... గబ్బిలాల రాకతో ప్రశాంత వాతావరణం...!

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మాధవరంపోడు... కోడూరు పట్టణానికి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఆ పల్లెలోనే గబ్బిలాలను దేవతామూర్తులుగా కొలుస్తారు. ఈ గబ్బిలాలు వచ్చినప్పటి నుంచి గ్రామ ఇబ్బందులు తొలగిపోయాయని... అభివృద్ధి బాటలో ఉన్నామని వీరి నమ్మకం.

ఒకప్పుడు ముఠా తగాదాలతో గ్రామం రక్తసిక్తమై ఉండేది. ఈ పక్షుల రాకతో ప్రశాంతం వాతావరణం నెలకొందని గ్రామస్థుల చెబుతున్నారు. అప్పటి నుంచి ఆ పక్షులకు ప్రమాదం లేకుండా చూస్తున్నారీ పల్లె ప్రజలు. ఎవర్నీ వేటాడనీయ్యరు. ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తున్నారు. ఆ ఊరి ప్రజలే కాదు.. చుట్టుపక్కల ప్రజలకూ ఈ గబ్బిలాలు పూజాదేవుళ్లే.

గబ్బిలాల మలాన్ని వ్యాధిగ్రస్థులైన పిల్లల శరీరానికి పూసి స్నానాలు చేస్తే ఆరోగ్యవంతులవుతారని ఇక్కడి వారి నమ్మకం. దిష్టి తగలకుండా వాటి ఎముకలు మెడకు, మొలతాడుకు కట్టుకుంటారు. గత 35 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

ఒకప్పుడు... మాధవరంపోడు గ్రామంలో గబ్బిలాలు ఒక చెట్టుకే ఉండేవి...ఇప్పుడవి విస్తరించాయి. రాత్రిపూట అడవికి వెళ్లి ఆహారం తిని తెల్లవారేసరికి గ్రామానికి చేరుకుంటాయి.

నిఫా వైరస్ గబ్బిలాలతో వచ్చిందని ప్రచారం జరిగినా ఈ ప్రాంత ప్రజలు పట్టించుకోలేదు. ఆ పక్షులతో ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న ఈ గ్రామస్థులు.. తమకు మంచే జరుగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

సంయుక్త సైనిక విన్యాసాలతో భారత్-అమెరికా సరికొత్త బంధం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.