దిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం కలకలం సృష్టిస్తుంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన దిలీప్ సత్య ఈ నెల 25వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దిలీప్ సత్య చండీగఢ్‌లో పనిచేస్తుండగా...హిమబిందు దిల్లీలోనే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. హిమబిందు భర్తకు దిలీప్ సత్య మిత్రుడు. ఈనెల 25న వీరువురు చర్చికి వెళ్తున్నట్లు చెప్పారని...ఆ తర్వాత అదృశ్యమైనట్లు హిమబిందు భర్త తెలిపారు. ఐదురోజులుగా పోలీసులు వారి ఆచూకీ కనుగొనలేకపోయారని.... వారికి ఏమైనా అపాయం జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :