తన ఇంటిని కాపాడుకునేందుకు ఓ వృద్ధురాలు తంటాలు పడుతోంది. ప్రస్తుతం న్యాయవివాదం కారణంగా.. కేసులో ఇరుక్కున్న తన ఇంటిని తిరిగి సొంతం చేసుకునేందుకు.. భిక్షాటన చేస్తోంది. ఇంటిని విడిపించుకోవడానికి లక్షా 13 వేల రూపాయలు ఖర్చు అవుతుందని.. ఆ సహాయాన్ని సినీ నటుడు సోనూసూద్ లేదా సీఎం జగన్ దానం చేసి ఆదుకోవాలని ఓ వృద్ధురాలు వేడుకుంటోంది. ఈ మేరకు వారిద్దరి చిత్రపటాలతో కడప అంబేద్కర్ కూడలి వద్ద భిక్షాటన చేపట్టింది.
కడపకు చెందిన రాజమ్మకు తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంటిని.. తమ సమీప బంధువుకు తాకట్టు పెట్టింది. ఆ వ్యక్తి తనకు తెలియకుండా మరొకరికి తాకట్టు పెట్టి.. తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రాజమ్మ ఆరోపించింది. ప్రస్తుతం ఆ ఇల్లు కోర్టులో ఉందని.. కేసు వాదించేందుకు న్యాయవాది లక్షా 13 వేల రూపాయలు అడుగుతున్నారని తెలిపింది.
అంత డబ్బు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నానని వృద్ధురాలు ఆవేదన చెందుతోంది. తనకు ఎక్కడా న్యాయం జరగలేదని... కోర్టు ద్వారా అయినా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆమె చెబుతోంది. సినీ నటుడు సోనూసూద్ లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు లక్షా 13 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంది. ఆ డబ్బుల కోసం భిక్షాటన చేస్తున్నానని తెలిపింది.
ఇదీ చదవండి: