ETV Bharat / city

ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు పని: అంజద్​ బాషా

author img

By

Published : Apr 15, 2020, 10:30 AM IST

కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుంటే హైదరాబాద్​లో కూర్చొని చంద్రబాబు విమర్శలు చేయటం సరికాదని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు. మంత్రి నారాయణస్వామి క్షమాపణలు కోరిన విషయం తెలుసుకోకుండా ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లుతున్నారని ఆగ్రహించారు. ముస్లింలను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Amzad basha
ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా
కడపలో మీడియాతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంటే.... ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్​లో కూర్చొని విమర్శలు చేయడం సబబు కాదని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణస్వామి ముస్లింలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారని గుర్తుచేశారు. ఇవేవీ తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా వైరస్ సోకిందని కొందరు ప్రచారం చేయడం మంచిదికాదన్నారు. అక్కడ వైరస్ ఉందని తెలిస్తే వారు దిల్లీ వెళ్లేవారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని ప్రధానమంత్రికి విన్నవించారన్నారు. ఆ విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. గత ఐదేళ్లలో ఏనాడు ముస్లింలను పట్టించుకోని చంద్రబాబు... ఇప్పుడు వత్తాసు పలికే విధంగా మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం నిర్ణయం మేరకు మే 3వ తేదీ వరకూ రాష్ట్రంలో లాక్​డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఎస్​ఈసీ మార్పులో రాజకీయం లేదు : అంజద్​ బాషా

పరిపాలనలో భాగంగానే ఎన్నికల కమిషనర్​ను మార్చారని, అందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశంలేదని అంజద్ బాషా అన్నారు. బడ్జెట్ కోసం ఏవిధంగా ఆర్డినెన్స్ తెచ్చామో... ఎస్​ఈసీ మార్పునకు అదే విధంగా ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ఆర్డినెన్స్​తో ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించడం ద్వారా కమిషనర్​ను మార్చాల్సి వచ్చిందని చెప్పారు. కొత్త కమిషనర్ వచ్చినంత మాత్రాన... రేపే ఎన్నికలు జరుగుతాయనే అపోహ మంచిది కాదని చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం, ప్రజల బాగోగులు చూసుకోవడంతోపాటు అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.

ఇదీ చదవండి:

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఆటంకం లేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.