Selfie on Goods Train : గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కటకంశెట్టి సైదారావు కుమారుడు వీరబ్రహ్మం ఇంటర్ వరకూ చదివాడు. ఇంటి వద్దే ఉంటున్న బ్రహ్మం బుధవారం సాయంత్రం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ కు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. నడికూడి నుంచి చెన్నై వెళ్లే గూడ్స్ రైలు ఫ్లాట్ ఫాంపై ఆగి ఉంది.గమనించిన వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అతనికి కొద్ది ఎత్తులోనే ఉన్న విద్యుత్ తీగలను గమనించని బ్రహ్మం సెల్ఫీలు దిగుతుండగా...కరెంటు తీగలు తగిలి పడిపోయాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో గమనించిన సమీపంలోని గొర్రెల కాపరి వచ్చి మంటలార్పి...దుస్తులు తొలగించాడు. తీవ్ర గాయాలపాలైన బ్రహ్మంను రైల్వే పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇదీ చదవండి : పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం పిలుపు...నేటి మధ్యాహ్నం చర్చలకు రావాలని ఆహ్వానం..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!