వైకాపా బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని ఛైర్మన్ కారెం శివాజీ భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు, పిన్నెల్లి గ్రామస్థులు ఆయనను కలిశారు. వారి వెంట తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, అశోక్ బాబు తదితరులు ఉన్నారు. తమను వైకాపా నేతలు గ్రామాల్లో ఉండనివ్వడం లేదని బాధితులు కమిషన్లో ఫిర్యాదు చేశారు. అండగా ఉండాల్సిన అధికారులూ నిస్సహాయంగా మారారన్నారు. ఈ వ్యవహారంపై డీజీపీ, కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని శివాజీ ఆదేశించారు. అవసరమైతే ఈ సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..