వైకాపా నేతలు అత్యుత్సాహంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరంలో వైకాపా నేతలు నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా... గుంటూరు అమరావతిలోని వేలంగిణి నగర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ప్రచారం చేపట్టారు. వెళ్ళడానికి వీలు లేకుండా వాహనాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు మొత్తాన్ని మూసివేశారు. వైకాపా నేతల తీరుపై వాహనదారులు, పాదచారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
గ్రామ సచివాలయాల్లో డేటా క్రోడీకరణకు కార్యాచరణ సిద్ధం చేయండి: సీఎం