YCP Leader Hulchal In PS : పోలీస్ స్టేషన్లో వైకాపా నేత హల్ చల్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వైకాపా నేత మద్యం సేవించి గందరగోళం సృష్టించిన.. ఆ వీడియో నెల రోజుల క్రితం నాటిదని పోలీసులు చెబుతున్నారు. ఆ వివరాలు...
ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేసినందుకు.. వైకాపా నాయకుడు పోలీస్ స్టేషన్ ప్రాంగణలో గందరగోళం సృష్టించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంటూరు జిల్లా అమరావతి వాసి లక్ష్మీనారాయణకు చెందిన ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు.
ఈ క్రమంలో మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన లక్ష్మీనారాయణ హడావుడి చేశాడు. అధికార పార్టీలో ఉన్న తన వాహనాన్నే సీజ్ చేస్తారా? అంటూ.. హల్‌చల్ చేశాడు. నేలపై దొర్లాడుతూ.. రచ్చ చేశాడు. పోలీసులు తనను అవమానించారని.. దీని కంటే చనిపోవడమే మేలంటూ కేకలు వేశాడు.
పోలీసులు సముదాయించినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో పోలీసులపై దూషణలకూ దిగాడు. ఈ ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి : పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా!