రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం (Yarapathineni fires on YSR Congress Leaders) చేశారు. గుంటూరు జిల్లా పల్నాడులో రోజురోజుకీ వైకాపా నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా పల్నాడులో 80 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. మరో ఏడుగురిని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. పిడుగురాళ్లలో సైదా అనే కార్యకర్త అల్లాని వేడుకుంటున్నా వైకాపా నేతలు కొట్టారని(YSR Congress leaders attack on TDP worker Saida) ధ్వజమెత్తారు. రేపు అనేది ఒకటి ఉంటుందని వైకాపా నేతలు గుర్తు పెట్టుకోవాలని యరపతినేని హితవు పలికారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి :