ETV Bharat / city

తెనాలి ఓటరు మనసు గెలిచేదెవరూ..? - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

శుద్ధి చేసిన తాగునీరు... సుందరమైన పరిసరాలు... సాఫీగా సాగిపోయే రహదారులు...ఏ పురపాలికలోనైనా అభివృద్ధికి ఆనవాళ్లుగా చెప్పుకునే అంశాలివే. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటి ఈ విషయంలో కొన్నేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. స్వచ్చ సర్వేక్షణ్ సర్వేలో జాతీయ స్థాయి అవార్డులు సాధించింది. పురపాలిక ఎన్నికలు జరుగుతున్న వేళ... తెనాలి స్వచ్ఛస్ఫూర్తి... భవిష్యత్తు కార్యాచరణపై రాజకీయ పక్షాల ప్రణాళికలెంటో అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

who-won-in-the-tenali-municipal-election

author img

By

Published : Mar 12, 2020, 11:00 AM IST

గుంటూరు జిల్లా తెనాలి... ఆంధ్రా ప్యారిస్ గా ఈ పట్టణానికి పేరుంది. కవులు, కళాకారులకు ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం... ఇటీవలి కాలంలో స్వచ్ఛత విషయంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. నవ్యాంధ్రప్రదేశ్​లో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించటంలో ముందుంటోంది. లక్షా 70వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో కొన్నేళ్ల కిందటి వరకూ.. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండేది. అయితే దేశవ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్చభారత్ స్ఫూర్తిని తెనాలి..అందిపుచ్చుకుంది.

తెనాలి ఓటరు మనసు గెలిచేదెవరూ..?

రాష్ట్రంలో తొలిసారి బయోటాయిలెట్లు

పరిశుభ్రతపై పురపాలక సంఘం బాగా శ్రద్ధపెట్టి ప్రజల్లో అవగాహన పెంచింది. ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. తడి చెత్త-పొడి చెత్త సేకరణ విధానాన్ని పకడ్బందీగా అమలు చేశారు. ఈ అంశం స్వచ్ఛత విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. మున్సిపాలిటి స్థాయిలోనే.. వ్యర్ధాల నిర్వహణను సమర్థంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే మున్సిపాలిటీ స్థాయిలో తొలిసారిగా బయోటాయిలెట్లను ఏర్పాటు చేసిన తెనాలి... నీటి వినియోగం అవసరం లేని మూత్రశాలలను కూడా ఏర్పాటు చేసింది.

మరింత కృషి చేయాలి..

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి...పట్టణంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూశారు. తెనాలి పట్టణం గుండా.. మూడు కాలువలు వెళుతుంటాయి. గతంలో వీటిని బహిరంగ మలవిసర్జనకు వినియోగించేవారు. ఇప్పుడు ఆ కాలువ కట్టలను పూలతోటలతో అందంగా ఆధునీకరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించలేని చోట సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను సైతం... మహిళా సంఘాలకు అప్పగించి.. ఎప్పటికప్పుడు వాటి నిర్వహణను.. కమిషనర్... వాట్సాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే పలు చోట్ల కొన్ని సమస్యలున్నాయని..వాటిని పరిష్కరించేందుకు అధికారులు మరింత కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పట్టణంలో ప్రతి రోజు.. దాదాపు70టన్నుల చెత్త.. పోగవుతోంది. దీనిని ఎప్పటికప్పుడు కంపోస్టుగా మారుస్తున్నారు. స్వచ్ఛత దిశగా తెనాలికి.. ప్రజల ప్రశంసలతో పాటు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు దక్కాయి. జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్​లో తెనాలి ప్రతిసారి అవార్డు సాధిస్తోంది. ప్రస్తుతం పురపాలిక ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ పార్టీలు స్వచ్ఛత విషయంలో హామీలు గుప్పిస్తున్నాయి. తమ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాల వల్లే స్వచ్ఛ తెనాలి సాధ్యమైందని తెదేపా నేతలు చెబుతున్నారు. ఇంతకంటే మెరుగ్గా తెనాలిని తయారు చేస్తామని అధికార వైకాపా నేతలు అంటున్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో సైతం తెనాలి అభివృద్ధి, మౌళికవసతుల కల్పనతో పాటు... స్వచ్ఛతా ప్రణాళిక కూడా రాజకీయ పార్టీల ఎజెండాలో భాగమైంది.

ఇదీ చదవండి : కృష్ణా జెడ్పీ పీఠం ఏ పార్టీది..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.