గుంటూరు జిల్లా దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో బాక్సులను పిల్లలతో మోయించడం కలకలం రేపింది. పదో తరగతి ప్రశ్నపత్రాలు తెచ్చిన అనంతరం ఖాళీ బాక్సులను ప్రధానోపాధ్యాయులు.. పోలీస్ స్టేషన్లో పెట్టాలని కాపలాదురుడికి చెప్పి వెళ్లిపోయారు. ఆ వాచ్మెన్ శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఆటలాడుకుంటున్న కొంతమంది పిల్లలను పిలిచి... వాటిని పోలీస్ స్టేషన్లో పెట్టమని చెప్పాడు. పిల్లలు బాక్సులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టారు. బాలల హక్కులు కాపాడాల్సిన పోలీసులు ఈ దృశ్యాలను చూస్తూ ఏమీ అనకపోవడం మరో ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ ఘటనపై స్పందించిన ఏంఈవో కాజా శ్రీనివాసరావు.. పిల్లలతో పెట్టమని చెప్పలేదని ఆ పనిని కాపలాదారుడికి చెప్పామని చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు సైతం వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలని.. విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు.
-
దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో పదవ తరగతి పరీక్ష పత్రాల బాక్సులను మోస్తున్న చిన్నారులను చూస్తే ఈ ప్రభుత్వం ఇంక మారదా అనిపించింది. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా అసలు? పోలీసులకు, అధికారులకు బాలల హక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరం. pic.twitter.com/gF4wEgNPV8
— Lokesh Nara (@naralokesh) April 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో పదవ తరగతి పరీక్ష పత్రాల బాక్సులను మోస్తున్న చిన్నారులను చూస్తే ఈ ప్రభుత్వం ఇంక మారదా అనిపించింది. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా అసలు? పోలీసులకు, అధికారులకు బాలల హక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరం. pic.twitter.com/gF4wEgNPV8
— Lokesh Nara (@naralokesh) April 29, 2022దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో పదవ తరగతి పరీక్ష పత్రాల బాక్సులను మోస్తున్న చిన్నారులను చూస్తే ఈ ప్రభుత్వం ఇంక మారదా అనిపించింది. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా అసలు? పోలీసులకు, అధికారులకు బాలల హక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరం. pic.twitter.com/gF4wEgNPV8
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
ఈ ప్రభుత్వం మారదా? : ఈ విషయంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆ దృశ్యాలు చూస్తే ఈ ప్రభుత్వం ఇంక మారదా? అనిపించిందని ధ్వజమెత్తారు. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా..? అని నిలదీశారు. పోలీసులకు, అధికారులకు బాలల హక్కుల గురించి అవగాహనలేకపోవడం బాధాకరమన్నారు.
ఇదీ చదవండి: టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ.. పోలీసుల అదుపులో ప్రధానోపాధ్యాయుడు