ETV Bharat / city

anand babu: గంజాయి రవాణా ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు.. నిరాకరించిన నక్కా ఆనంద్‌బాబు

గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా నడిచింది. విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఆనంద్​ బాబు ఇంటికి వెళ్లి గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. రాత్రి సమయంలో పోలీసులు రావడంపై ఆనంద్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గంజాయి రవాణా ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు
గంజాయి రవాణా ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు
author img

By

Published : Oct 19, 2021, 4:41 AM IST

గుంటూరులోని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా నడిచింది. విశాఖలో గంజాయి రవాణాకు సంబంధించి ఆనంద్ బాబు సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో పాటు విజయసాయిరెడ్టిపై ఆనంద్ బాబు ఆరోపణలు చేశారు. దీనిపై నోటీసులు జారీ చేసేందుకు ఆనంద్ బాబుకు ఇంటికి విశాఖ జిల్లా నర్సీపట్నం సిఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి వచ్చారు. రాత్రి సమయంలో పోలీసులు రావటంపై ఆనంద్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఆనంద్ బాబును కోరారు.

తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఇంటికి సోమవారం రాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు వచ్చారు. విశాఖ మన్యం నుంచి గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఆనంద్‌బాబు సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌బాబు వైకాపా ప్రభుత్వంతో పాటు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీంతో వసంతరాయపురంలోని ఆనంద్‌బాబు ఇంటికి వచ్చిన నర్సీపట్నం పోలీసులు.. గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్‌ రికార్టు చేసుకుంటామని తెలిపారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనంద్‌బాబు నిరాకరించారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి స్థావరాలపై తెలంగాణ పోలీసులు దాడి చేయడం దారుణం. దాడి సమయంలో రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు?గిరిజనులపై దాడి జరిగితే మాట్లాడే హక్కు మాకు లేదా అన్నారు. మాజీ మంత్రిగా మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా? ప్రస్తుత డీజీపీ కొత్త సంస్కృతి తెస్తున్నారు. తెదేపా ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా?అని ప్రశ్నించారు.

గంజాయి రవాణాపై ఆధారాలు లేదా వివరణ ఇవ్వాలని ఆనంద్‌బాబును అడిగినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఆధారాలు లభిస్తాయని నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చామని తెలిపారు. ఆనంద్‌బాబు అర్ధరాత్రి స్టేట్‌మెంట్‌ ఇవ్వను అన్నారు. అందుకే మంగళవారం ఉదయం వస్తామని చెప్పాం. స్టేట్‌మెంట్‌ ఇవ్వకుంటే 91 సీఆర్ఫీఎఫ్‌ కింద నోటీసులు ఇస్తాం. అప్పుడు చింతపల్లి వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సీఐ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.