ETV Bharat / city

జనాభా తక్కువైనా.. కేసులెక్కువే! - ఏపీలో కరోనా అప్​డేట్స్

కరోనా పాజిటివ్‌ కేసుల వ్యాప్తిలో కొత్త ధోరణి కనిపిస్తోంది. పట్టణాలు, నగరాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్నందున కేసులు ఎలాగూ అక్కడ ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ జనసాంద్రత తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం కొత్త పరిణామం.

villages also effected with corona in andhrapradesh

author img

By

Published : Apr 22, 2020, 6:42 AM IST

గ్రామీణ ప్రాంతాల్లో సగటున లక్ష మందికి ఎన్ని కేసులు నమోదయ్యాయన్న గణాంకాలు చూస్తే.. రాష్ట్రంలో 11చోట్ల ప్రతి లక్షకి పదికిపైగా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక పరిధిలో 33,732 జనాభా ఉంటే లక్షకు 29.65 కేసులు నమోదయ్యాయి. ఇదే జిల్లా వాకాడు మండలంలో 35,385 జనాభా ఉంటే లక్షకు 19.85 కేసులు వచ్చాయి. ఇలాగే ప్రతీ లక్ష జనాభాకు కడప జిల్లా బద్వేలులో 19.78, పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో 16.56, తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో 13.35, కర్నూలు జిల్లా పాణ్యంలో 11.12 వంతున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐదు జిల్లాల ప్రధాన కేంద్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గుంటూరు నగరం-97, కర్నూలు-68, విజయవాడ-52, నెల్లూరు-33, ఒంగోలులో 27 వంతున కేసులు వచ్చాయి. వైరస్‌ ప్రైమరీ నుంచి సెకండరీ కాంటాక్టుల వరకూ కూడా సోకడంతో ఒకే ప్రాంతంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

* రాష్ట్రం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో.. గరిష్ఠంగా గుంటూరులో 16.64% కేసులు నమోదయ్యాయి. జనాభా ప్రతి లక్షకు 15.65 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నగరంలోని ఆనందపేటలో 35, కుమ్మరిబజారులో 30, సంగడిగుంటలో 10 కేసులు వచ్చాయి.

* కర్నూలులో 68 కేసులు నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఇవి 11.5%. నగరంలోని ప్రతి లక్ష జనాభాకు 14.65 చొప్పున కేసులు వచ్చాయి. కర్నూలు పాత నగరం, దీనికి అనుకుని ఉన్న ఎన్నార్‌పేట, ప్రకాశ్‌నగర్‌, గనిగల్లి, ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యాయి.

* విజయవాడలో 52 (రాష్ట్రస్థాయిలో 8.8%) కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు ఏడుగురు కరోనా బారిన పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యాధరపురం, సనత్‌నగర్‌ (కానూరు), ఖుద్దూస్‌నగర్‌, వన్‌టౌన్‌లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విద్యాధరపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వైరస్‌ బారినపడ్డారు.

* నెల్లూరు 33 కేసులతో రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో (5.6%) ఉంది. ప్రతి లక్షకు ఏడుగురు వైరస్‌కు గురయ్యారు.

* ఒంగోలులో 27 పాజిటివ్‌ కేసులు (రాష్ట్రస్థాయిలో 5వ స్థానం) వచ్చాయి. లక్ష జనాభాకు 11 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో ఒక్కచోటే 26 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా.. కొత్త కేసులు 39

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.