పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం బడుగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. 11నెలలుగా వేతనాలు చెల్లించకపోవటంతో.. కుటుంబాలను పోషించుకోలేక, విధులు బహిష్కరించి పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై నిరసనను తెలపడాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారన్నారు. ఆకలితో అల్లాడుతున్న సామాన్య పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా పస్తులు ఉంచటం దుర్మార్గమన్నారు. జీతాలు చెల్లించకుండా వారి నుంచి సేవలు ఎలా ఆశిస్తారని మండిపడ్డారు. సకాలంలో జీతాలు చెల్లించి పారిశుద్ధ్య కార్మికుల ఈతి బాధలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: దేశంలో ఒక్క రోజులోనే 1,750 కరోనా కేసులు