ముఖ్యమంత్రి జగన్‌కు వ్యక్తిగత మినహాయింపు ఇచ్చేది లేదని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ కేసుల్లో కోర్టు తీర్పు సమర్థనీయమన్నారు. జగన్ సీఎం అయితే చట్టానికి ఏమైనా అతీతుడా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ఐదు నెలల పాలనపై ఒక్కసారైనా మీడియాతో మాట్లాడారా అని ప్రశ్నించారు. మీడియా అంటే ఎందుకు జగన్‌కు అంత భయమని విమర్శలు చేశారు. జగన్ కోర్టుకు హాజరైతే రూ. 60 లక్షల ఖర్చు ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. 6 సంవత్సరాల క్రితం నమోదైన కేసులను ఏదో వంకతో విచారణ జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న తనపై కేసులను త్వరితగతిన విచారణ చేయాలని ఆయన కోర్టును కోరాలని సూచించారు. క్విడ్ ప్రోకో అనే పదం జగన్ వల్లే ప్రపంచంలో ప్రాచుర్యం పొందిందన్నారు. ముద్దాయిలు అందరిని జగన్ తన చుట్టూ పెట్టుకున్నారని ఆరోపించారు. ఏపీలో ముద్దాయిల పాలన సాగుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"జగన్ అభ్యర్థనను.. కోర్టు తిరస్కరించటం సమర్థనీయం"
అక్రమ ఆస్తుల వ్యవహారంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. దీనిని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సమర్థించారు. ముఖ్యమంత్రి అయితే... చట్టానికి అతీతుడా అంటూ ప్రశ్నించారు.