ETV Bharat / state

పోలీస్ కోవర్టుల కనుసన్నల్లోనే 'వర్రా' పరార్! - తెరవెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాలు ఇవే - YSRCP COVERTS ON POLICE DEPARTMENT

వర్రా రవీందర్‌రెడ్డి తప్పించుకోవడంలో పలువురు పోలీసుల హస్తం - ప్రభుత్వం మారిన బుద్ధి మార్చుకోని వైఎస్సార్సీపీ కోవర్టులు

YCP Coverts on Police Department
YCP Coverts on Police Department (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 8:54 AM IST

YCP Coverts on Police Department : పోలీసుశాఖలో వైఎస్సార్సీపీ కోవర్టులు ఉండడంతోనే ఆ పార్టీ పులివెందులకు చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి పరారైనట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వర్రాను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు నాటకాలు ఆడడం, 41-ఏ నోటీసులిచ్చి రాచమర్యాదలతో సాగనంపడం వంటి విషయాలని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కొందరు పోలీసు అధికారులు వైఎస్సార్సీపీకు కోవర్టులుగా వ్యవహరిస్తున్నట్లుగా అంచనాకు వచ్చారు. ఈ మేరకు కోవర్టులు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

వర్రా పరారయ్యేందుకు పక్క ప్లాన్ : వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నిందితుడిని అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తాత్సారంతో వదిలేసినట్లుగా విచారణలో తేలింది. కడప చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ తేజోమూర్తికి సంబంధం లేనప్పటికీ రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవటం కోసం ఆయన్ను వినియోగించారు. వేముల- వేంపల్లె మధ్య రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత తేజోమూర్తి తెరవెనుక ఉండి తాలూకా సీఐ వెంకటేశ్వర్లు ద్వారా వ్యవహారం నడిపినట్లుగా తేలింది. తేజోమూర్తితో పాటు తాలూకా, రాజంపేట పోలీసులతో పాటు ఎస్బీ మాజీ సీఐగా ఉన్న వ్యక్తి రంగప్రవేశం చేసి వర్రా పరారయ్యేవిధంగా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ అనుమానంతోనే కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ బుధవారం రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో పర్యటించి సమీక్షించారు. కడపతో పాటు రాజంపేట, బద్వేలు, చిట్వేలిలోని కొందరు పోలీసు అధికారుల తీరుపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి.

'టీడీపీ గెలిస్తే కొవ్వు పెరిగిందా?' - హెడ్​ కానిస్టేబుల్​ దూషించాడని మహిళల ఆవేదన - Head Constable Abused Women

  • వర్రా రవీందర్‌రెడ్డిపై కడప, రాజంపేట, మంగళగిరి, హైదరాబాద్‌లలో పలు కేసులున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు పట్టించుకోకుండా తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకునే పక్షంలో వరుస కేసులతో జైలు పాలు కావాల్సిన రవీందర్‌రెడ్డి చివరికి పరారయ్యారు. అనంతరం వెంబడించగా 567 నంబరు గల వాహనం ఖాజీపేట టోల్‌గేటు దాటినట్లు గుర్తించారు. ఆ వాహనాన్ని వెంబడించినా అందులో లేకుండా మరో వాహనంలో పారిపోయినట్లు సమాచారం. పులివెందుల మీదుగా బెంగళూరు వెళ్లిపోయినట్లు అంచనాకు వచ్చిన పోలీసులు ఆ మేరకు గాలింపు చర్యలు చేపట్టారు.
  • రాష్ట్ర ప్రభుత్వం రవీందర్‌రెడ్డి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదనపు ఎస్పీ ప్రకాశ్‌బాబు నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బృందాలు వేర్వేరుగా పలు ప్రాంతాలకు వెళ్లాయి. వర్రా వినియోగించే రెండు చరవాణులు స్విచ్ఛాప్‌ చేయడంతో పాటు తన వద్ద లేకుండా జాగ్రత్తలు పడినట్లు పోలీసులు గుర్తించారు. తద్వారా సిగ్నల్‌ ద్వారా తనను గుర్తించకుండా జాగ్రత్తలు పడినట్లు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న నిందితుడిని పక్కా ప్రణాళికతో పోలీసులు వదిలేయడం, అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రభుత్వాన్ని నమ్మించే ప్రయత్నాలు జరిగాయనే అంచనాకు వచ్చారు.

రాష్ట్రంలోనే సంచలనం : వర్రా రవీందర్‌రెడ్డి పరారు కావడం రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ప్రభుత్వం సైతం నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎస్పీ హర్షవర్దన్‌రాజును బదిలీ చేయడంతో పాటు బాధ్యుడైన సీఐ తేజోమూర్తిని సస్పెండ్‌ చేశారు. ఈ వ్యవహారంతో పోలీసుశాఖ సైతం తీవ్రంగా స్పందిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే వారిపై కొరడా ఝళిపిస్తోంది. పెండింగ్‌ కేసులను పరిష్కరించే దిశగా కదిలిక వచ్చింది. అన్నమయ్య జిల్లాలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి తాత్సారం చేయొద్దని వెల్లడించారు. ఇందుకోసం కడపలో గురువారం పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరోవైపు బాధితురాలైన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సైతం గురువారం తీవ్రంగా స్పందించారు. తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.

వర్రాపై ఎమ్మెల్యే ఫిర్యాదు : వర్రా రవీందర్‌రెడ్డిపై ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. గత ఐదేళ్లుగా ఫేస్‌బుక్‌, సామాజిక మాధ్యమం వేదికగా రవీందర్‌రెడ్డి తనపై అనుచితమైన పోస్టులు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ తాను పలు టీవీ చర్చా వేదికల్లో మాట్లాడినప్పుడు తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు వివరించారు. అప్పట్లో అతని విమర్శలను సామాజిక మాధ్యమం వేదికగానే తిప్పికొట్టానన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డే కారణమని నెల రోజుల కిందట తాను ఓ టీవీ ఛానెల్‌లో మాట్లాడగా అందుకు వర్రా రవీందర్‌రెడ్డి తనపై ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టు పెట్టారన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఠాణాకు వచ్చి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును సెక్టార్‌-1 ఎస్‌.ఐ.కేవీజీవీ.సత్యనారాయణ స్వీకరించారు.

ఈ పోలీసులేంటీ ఇలా అయిపోయారు బ్రో! ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు - AP Police Corruptions

'ఛాతీపై పోలీస్ దాడి, లైంగిక వేధింపులు కూడా!'- ఆర్మీ ఆఫీసర్​ భార్య కేసులో సంచలన విషయాలు! - Odisha Army Officer Case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.