ETV Bharat / state

గజరాజుకి కొండంత కష్టం - చివరకు సుఖాంతం - ఎలాగంటే - ELEPHANTS FRIENDSHIP IN MANYAM

తోటి ఏనుగుకు తొండం అందించి పైకి లాగేందుకు ప్రయత్నం - స్నేహానికి నిదర్శనంగా నిలిచిన ఏనుగులు

Elephants Unity in Parvathipuram District
Elephants Unity in Parvathipuram District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 8:36 AM IST

Updated : Nov 8, 2024, 8:45 AM IST

Elephants Unity in Parvathipuram District : అదో ఓ ఏనుగుల గుంపు. ఆ గుంపులో 2 ఏనుగులు చూపిన స్నేహ స్ఫూర్తి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి సమీపంలో ఏనుగుల గుంపు సంచరించింది. అవి ఒక దాని తరువాత ఒకటి జంఝావతి కాలువలోంచి గట్టును ఎక్కి అడవిలోకి వెళ్లాయి. ఒకటి మాత్రం గట్టెక్కలేక కాలువలోనే అవస్థలు పడతూ ఉండిపోయింది. ఇంతలో ముందు వెళ్లిన మందలోని ఒక ఏనుగు గమనించింది. అంతే వెనక్కి వచ్చింది. గట్టెక్కే యత్నంలో జారుతున్న సహచర ఏనుగు తిప్పలు చూసింది. తోటి స్నేహితుడికి తొండం అందించి పైకి లాగేందుకు ప్రయత్నం చేసింది. ఎంతకూ ఫలితం కనిపించలేదు. ఎలా పైకెక్కాలా అని కాసేపు అటూ ఇటూ చూసింది. ఎలాగైనా గట్టు ఎక్కాలని ఆలోచించింది. చివరికి కాలువలోనే కొంచెం ముందుకు వెళ్లి గట్టు ఎత్తు తక్కువగా ఉన్న చోటు నుంచి పైకి చేరుకుంది. అప్పటిదాకా తన కోసం గట్టు మీదు ఉన్న మిత్రుడితో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.

అయ్యో ఇప్పుడెలా? గట్టు ఎక్కలేక అవస్థ పడుతున్న ఓ ఏనుగు
అయ్యో ఇప్పుడెలా? గట్టు ఎక్కలేక అవస్థ పడుతున్న ఓ ఏనుగు (ETV Bharat)
మిత్రమా ఏంటి నీ పరిస్థితి: సహచరి కోసం ఆగిన మరో ఏనుగు
మిత్రమా ఏంటి నీ పరిస్థితి: సహచరి కోసం ఆగిన మరో ఏనుగు (ETV Bharat)
భయపడొద్దు నేనున్నా: ఏనుగును గట్టెక్కించేందుకు తొండం అందిస్తూ..
భయపడొద్దు నేనున్నా: ఏనుగును గట్టెక్కించేందుకు తొండం అందిస్తూ.. (ETV Bharat)
నేనే ఎక్కేస్తా: స్వయం కృషితో మరో దారిలో గట్టెక్కుతూ..
నేనే ఎక్కేస్తా: స్వయం కృషితో మరో దారిలో గట్టెక్కుతూ.. (ETV Bharat)

'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్​! - Mother Elephant Tearful Moment

Last Updated : Nov 8, 2024, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.