రాష్ట్రలో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections)కు సంబంధించి.. వైకాపా అభ్యర్థులను (ycp candidates) దాదాపు ఖరారు చేశారు. నేడు లేదా రేపు తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపుగా ఈ కింది వారే ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
విజయనగరం: ఇందుకూరి రఘురాజు
విశాఖ (2): వరుదు కళ్యాణి, విశాఖపట్నం కార్పొరేటర్ వంశీకృష్ణ యాదవ్
తూర్పుగోదావరి: అనంత ఉదయభాస్కర్
చిత్తూరు: కుప్పం నియోజకవర్గ వైకాపా నేత కె.భరత్
కృష్ణా (2): తలశిల రఘురాం, ఎస్సీ /బీసీ అభ్యర్థి
గుంటూరు(2): ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్ లేదా ఎస్సీ/బీసీ అభ్యర్థి
ప్రకాశం: తూమాటి మాధవరావు లేదా ఎస్సీ/బీసీ అభ్యర్థి
అనంతపురం: వై.శివరామిరెడ్డి లేదా విశ్వేశ్వరరెడ్డి
గుంటూరు-ప్రకాశం మధ్య లింకు..
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో సామాజికవర్గం ముడి పడిందంటున్నారు. ప్రస్తుతానికి ప్రకాశంలో తూమాటి మాధవరావు, గుంటూరులో మర్రి రాజశేఖర్‌ల పేర్లు దాదాపు ఖరారయ్యాయనే ప్రచారం ఉంది. అయితే ఇదే వర్గానికి చెందిన మరో అభ్యర్థికి కృష్ణాజిల్లాలో తాజాగా చోటు దక్కినట్టు సమాచారం. దీంతో.. ఇప్పుడు రాజశేఖర్, మాధవరావులలో ఒకరికే అవకాశం దక్కవచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
కృష్ణా జిల్లాలో రెండోస్థానాన్ని ఉప్పాళ్ల రాముకు ఇవ్వాలని గతంలో పార్టీలో చర్చ జరిగింది. అయితే.. ఇటీవలే ఆయన భార్య హారిక కృష్ణా జడ్పీ ఛైర్‌పర్సన్ అయ్యారు. ఆరు నెలల్లో ఆమె రాజీనామా చేస్తే రాముకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చర్చ జరిగినా, అందుకు రాము ముందుకు రాలేదని తెలిసింది. ఇప్పుడు మచిలీపట్నానికి చెందిన మత్స్యకార అభ్యర్థి పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ఉమ్మడి అంధ్రప్రదేశ్ శాసనమండలిలో చీఫ్‌విప్‌గా పనిచేసిన వై.శివరామిరెడ్డిలలో ఒకరికి ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. ఒకరికి ఎమ్మెల్సీ పదవి, మరొకరికి నియోజకవర్గ పార్టీ సమన్వయ బాధ్యత ఇస్తామని పార్టీ అధినాయకత్వం వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇదీ చదవండి