ETV Bharat / city

Ramya Murder: అట్టుడుకిన గుంటూరు.. రమ్య మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత

గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య మృతదేహం తరలింపు నుంచి అంత్యక్రియల వరకు అనుక్షణం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రమ్య తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు తెలుగుదేశం నేతలతో కలిసి లోకేశ్‌ వారి ఇంటివద్దకు చేరుకోగా.. అదే సమయానికి వైకాపా నేతలు సైతం కార్యకర్తలతో కలిసి అక్కడికి రావడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల అరుపులు, కేకలు, కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, వ్యక్తిగత దూషణలు, తోపులాటలతో గుంటూరులోని జీజీహెచ్‌ సమీపంలోని ప్రధాన రహదారి రణరంగాన్ని తలపించింది.

Ramya Murder
Ramya Murder
author img

By

Published : Aug 17, 2021, 5:28 AM IST

Updated : Aug 17, 2021, 6:51 AM IST

గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య మృతదేహం తరలింపు నుంచి అంత్యక్రియల వరకు అనుక్షణం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం శవపరీక్ష నిర్వహించాక మృతదేహాన్ని ఇంటికి తరలించడంపై తెదేపా, వైకాపా నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఒకరికొకరు నెట్టుకుంటూ కలబడేవరకు పరిస్థితి వెళ్లింది. ఇరువర్గాల అరుపులు, కేకలు, కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, వ్యక్తిగత దూషణలు, తోపులాటలతో గుంటూరు జీజీహెచ్‌ సమీపంలోని ప్రధాన రహదారి రణరంగాన్ని తలపించింది.

రమ్య మృతదేహంవద్ద నివాళులర్పించటానికి వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలనూ అదుపులోకి తీసుకున్నారు. పరామర్శకు లోకేశ్‌ జీజీహెచ్‌కు త్వరలో రానున్నారన్న సమాచారంతో రమ్య మృతదేహాన్ని హుటాహుటిన ఆమె ఇంటికి తరలించటానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇది రెండు పార్టీల నేతల మధ్య గొడవకు కారణమైంది. అంబులెన్సును కదలనీయకుండా జీజీహెచ్‌ ఎదురుగా రోడ్డుపై తెదేపా కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. వాహనానికి అడ్డుపడ్డారు. ప్రత్యామ్నాయంగా పోలీసులు అరండల్‌పేట వంతెనపై రాకపోకలను నిలిపేసి వాహనాన్ని వెనక్కి మళ్లించడానికి ప్రయత్నించగా అక్కడా తెదేపావారు అడ్డుకున్నారు. అదే సమయంలో జీజీహెచ్‌ లోపలినుంచి వస్తున్న వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనాలు ఈ రద్దీలో చిక్కుకుపోయాయి. దీంతో అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య, మరికొందరు జీజీహెచ్‌కు చేరుకుని ప్రభుత్వానికి అనుకూల నినాదాలిచ్చారు. ప్రతిగా తెదేపా కార్యక్తర్తలు నినాదాలు చేశారు. నడిరోడ్డుపై వారు వాదులాడుకుంటుండగానే పోలీసులు అంబులెన్సును అరండల్‌పేట వంతెన కింద నుంచి రైల్వేస్టేషన్‌ రోడ్డుమీదుగా పంపించారు.

అట్టుడుకిన గుంటూరు.. రమ్య మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్తత..

ఆ తర్వాతా తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణ కొనసాగుతుండటంతో నిలువరించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. చివరకు తెదేపా గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తమ కార్యకర్తలకు నచ్చజెప్పారు. మృతురాలి ఇంటికి లోకేశ్‌ చేరుకుంటున్నారని, అక్కడకి వెళదామని సూచించారు. ఈ క్రమంలో ధూళిపాళ్ల నరేంద్ర వాహనంపై వైకాపా కార్యకర్తలు చెప్పులు వేస్తూ దాడి చేశారు. తెలుగు యువత నాయకుడు అబ్బూరి మల్లి కారు దిగి వైకాపా కార్యకర్తలపై దూసుకెళ్లటంతో మరోసారి వాగ్వాదమేర్పడింది.

మృతురాలి ఇంట్లో లోకేశ్‌ ఉండగానే..

రమ్య ఇంటికి వచ్చిన లోకేశ్‌ వెంట మాజీ మంత్రులు పుల్లారావు, ఆనందబాబు, నాయకులున్నారు. ఘటనకు కారణాలను మృతురాలి కుటుంబీకులను అడిగి లోకేశ్‌ తెలుసుకున్నారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యేలు ముస్తాఫా, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నగర మేయర్‌ మనోహర్‌ నాయుడు, వైకాపా నాయకులు శ్రద్దాంజలి ఘటించటానికి రావటంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్‌, ఇతర తెదేపా నేతలను ఖాళీ చేయించటానికి పోలీసులు వచ్చారు. పోలీసులు వెనక్కు నెట్టడంతో తెదేపా నేతలు నసీర్‌ అహ్మద్‌, ఆనందబాబు, మాణిక్యాలరావు కిందపడిపోయారు. ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్‌, విశాల్‌ గున్నీలను కలిసి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతుండగానే పోలీసులు వాహనాలను తీసుకొచ్చి బలవంతంగా వాటిల్లో ఎక్కించి నల్లపాడు, చేబ్రోలు, ప్రత్తిపాడు స్టేషన్లకు తీసుకెళ్లారు. ఆలపాటి రాజా, పుల్లారావు, ఆనందబాబు, అనితను అరెస్టు చేసి తరలించారు.

7 గంటలకుపైగా పోలీసుల అదుపులో

మధ్యాహ్నం 12.45కు లోకేశ్‌ను గుంటూరు నుంచి జీపులో తీసుకెళ్లి ప్రత్తిపాడు స్టేషన్‌లో ఉంచారు. సాయంత్రం 5.30 తర్వాత అక్కడి నుంచి పెదనందిపాడు మీదుగా పొన్నూరు, చేబ్రోలు, గుంటూరులో తిప్పి రాత్రి ఎనిమిదింటికి పెదకాకాని స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టారు. లోకేశ్‌ మధ్యాహ్నం భోజనం చేయలేదు. ప్రత్తిపాడు నుంచి నేరుగా గుంటూరుకు 40 నిమిషాల్లో చేరుకుంటారని, అలాంటిది పెదకాకానికి తీసుకురావటానికి ఆయా ప్రాంతాల్లో తమను వాహనంలోనే తిప్పారని లోకేశ్‌ వెంటనున్న చిట్టిబాబు వివరించారు. అరెస్టు చేసినప్పటి నుంచి మొత్తంగా ఏడు గంటలకు పైగా లోకేశ్‌ పోలీసుల అదుపులోనే ఉన్నారు. మృతురాలి ఇంటివద్ద లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మృతురాలి కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వస్తే అడ్డుకుని ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

దళిత సంఘాల ఆందోళన

మరోవైపు ప్రభుత్వం పరిహారం పెంచడంతోపాటు భూమి ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగమివ్వాలనే డిమాండ్లతో అంత్యక్రియలు నిర్వహించకుండా దళిత సంఘాలు అడ్డుకున్నాయి. చివరకు ఎమ్మెల్యేలు ముస్తాఫా, మేరుగ నాగార్జున ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇవ్వటంతో అంత్యక్రియలను సాయంత్రం చేశారు.

కేసులు నమోదు చేస్తాం

అంబులెన్సుకు అడ్డుపడటం, పోలీసు విధులను అడ్డుకోవటం, కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి గుంపులుగా రావటం తదితర సెక్షన్ల కింద బాధ్యులైన వారిపై కేసులు పెడతామని గుంటూరు రూరల్‌, అర్బన్‌ ఎస్పీలు విశాల్‌ గున్నీ, ఆరిఫ్‌ హఫీజ్‌ స్పష్టం చేశారు. తమను అడ్డుకున్న వారిని పార్టీలతో సంబంధం లేకుండా ప్రాథమికంగా 30 మందిని గుర్తించామన్నారు.

రూ.10 లక్షల పరిహారం అందజేత

హోం మంత్రి సుచరిత జీజీహెచ్‌కు వచ్చి మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. తెదేపా శవ రాజకీయాలకు పాల్పడుతోందని, మృతదేహాన్ని తరలించకుండా అడ్డుపడటమేమిటని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

lokesh fire on cm jagan జగన్‌ సీఎం అయ్యాకే మహిళలపై దాడులు పెరిగాయి: లోకేశ్‌

Last Updated : Aug 17, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.