ఇదీ చదవండి : చింతామణి నాటకం నిషేధంపై.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
TDP Leader Dhulipala on Mining : ప్రజాప్రతినిధుల అండతోనే మైనింగ్: ధూళిపాళ్ల నరేంద్ర - అక్రమ మైనింగ్ పై తెదేపా నేత ధూలిపాళ్ల నరేంద్ర
TDP Leader Dhulipala on Mining ప్రజాప్రతినిధుల అండతోనే గుంటూరు జిల్లా సుద్దపల్లిలో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అక్రమంగా గ్రావెల్ తవ్వకాల్ని నిరసిస్తూ ఆయన క్వారీలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం అక్కడే బైఠాయించి ఆందోళన చేసినా.. అధికారులు ఎవరూ అటువైపుగా తొంగిచూడలేదు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఇక్కడ మైనింగ్ వ్యవహారాలపై ఆందోళన చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు తమ పార్టీ నేతలు చేస్తున్న అక్రమ తవ్వకాలపై ఏం సమాధానం చెబుతారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. అధికారులు వచ్చి తవ్వకాలు నిలువరిస్తామని హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదంటున్న నరేంద్రతో "ఈటీవీ-భారత్" ముఖాముఖి.
ప్రజాప్రతినిధుల అండతోనే మైనింగ్ -ధూలిపాళ్ల నరేంద్ర
Last Updated : Feb 10, 2022, 6:31 AM IST