ETV Bharat / city

వైకాపా నేత కాబట్టే నూతన నాయుడుని అరెస్ట్ చేయలేదు: నక్కా ఆనందబాబు - నక్కా ఆనందబాబు

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని తెదేపా నేత నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి అయిన నూతన నాయుడుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

tdp leaders nakka anand babu gadde rammohan criticise ycp government
నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి
author img

By

Published : Aug 30, 2020, 2:07 PM IST

దళితులపై జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా గుంటూరులో నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎస్సీలపై దాడులు పెరిగాయన్నారు. వైకాపా గెలుపునకు ప్రధాన పాత్ర పోషించిన దళితలపైనే దాడులు చేయడం బాధాకరమన్నారు.

దళిత యువకుడిని విచక్షణా రహితంగా కొట్టి.. శిరోముండనం చేసిన కేసులో ప్రధాన ముద్దాయి నూతన నాయుడుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అయన ప్రశ్నించారు. నూతన నాయుడు వైకాపా నాయకుడు కాబట్టే కేసును నీరుకార్చుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు జరిగాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా దళితలపై దాడులను అరికట్టాలని... లేనిపక్షంలో దళితల సంఘాలు అన్నీ ఏకమై ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు.

'నూతన నాయుడు వైకాపా వ్యక్తి అని అతని ఆడియోలు, వీడియోలు చూస్తే అర్థమవుతుంది. వైకాపా నాయకుడు కాబట్టే శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం దళితులపై దాడులు చేసేవారికి కొమ్ముకాస్తోంది. సీతానగరంలో మొదటి శిరోముండనం కేసు జరిగినప్పుడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే రెండో ఘటన జరిగేదికాదు.'-- నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి

దళితులపై దాడులు సరికావు: గద్దె రామ్మోహన్

వైకాపా ప్రభుత్వం వల్ల మొదటి నుంచి దళిత జాతి అవమానాలు పడుతోందని.. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. దళితులపై దాడుల గురించి ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరితో, వ్యవస్థలను నిర్వీర్యం చేసి, తమకు అనుకూలంగా మార్చుకుని.. దళితులపై దాడులు చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పును దిద్దుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.