గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటిస్తోంది. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మహిళా కమిషన్ సభ్యులను తెదేపా నేతలు కలిశారు. తెదేపా నేతలు గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ, గద్దె అనురాధ, దివ్యవాణి బృందాన్ని కలిశారు. రాజధానిలో మహిళలపై దాడిని కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్ సింగ్‌లకు వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చదవండీ...