ETV Bharat / city

'వైకాపా ఎమ్మెల్యే ముస్తఫాను ఎందుకు అరెస్టు చేయలేదు?' - వైసీపీ ఎమ్మెల్యే గోదాములో గుట్కా

కరోనా బాధితులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా.. అందుకు తగిన వైద్య సదుపాయాలు లేవన్నారు. కరోనాను సైతం వైకాపా నేతలు ఆదాయమార్గంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా గోదాములో గుట్కా తయారుచేస్తున్నా... పోలీసులు ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

తెదేపా నేత జీవీ ఆంజనేయులు
తెదేపా నేత జీవీ ఆంజనేయులు
author img

By

Published : Jul 22, 2020, 10:18 PM IST

కరోనా బాధితులకు వైద్యం అందించటంలో, క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కరోనా కేసులు నిత్యం వేల సంఖ్యలో వస్తున్నాయని... అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించటం లేదని విమర్శించారు. కరోనాను కూడా ఆదాయ మార్గంగా మార్చుకుని... బ్లీచింగ్ పౌడర్ పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి వెళ్లే వారికి రూ. 2 వేలు ఇస్తామని చెప్పినా అందరికి సాయం అందడం లేదని ఆంజనేయులు ఆరోపించారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు చెందిన గోదాములో గుట్కా తయారీ కేంద్రం నడుస్తున్నా... పోలీసులు ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. గుట్కా తయారీదారుడు సుధాకరరెడ్డి.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బంధువు కాబట్టే పోలీసులు కేసుని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సీఎం నివాసం, హైకోర్టుకు అతి చేరువలో గుట్టుగా గుట్కా తయారుచేసి, ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంటే పోలీసులు ఎందుకు పసి గట్టలేకపోయారన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ దందా సాగుతుందన్నారు. ఎమ్మెల్యే ముస్తఫాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : జనసేనాని పవన్ ముఖాముఖి.. పార్ట్-1 రేపు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.