ఇవీ చూడండి-ఇసుక... ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుంది..!
'జీవో విషయంలో.. జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారు'
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలాంటి మీడియాపై ఆంక్షలు, నిబంధనలు విధించడం సరికాదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్ హయాంలో జీవో నెంబర్ 938 ని విడుదల చేసి ఆయనే రద్దు చేశారని... జగన్ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ తండ్రిని మించిన తనయుడిగా తయారయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'జీవో విషయంలో తండ్రిని మించిన తనయుడిగా జగన్ వ్యవహరిస్తున్నారు'
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే.. నిట్టనిలువునా ఖూనీ చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం లాంటి మీడియాపై ఆంక్షలు, నిబంధనలు విధించడం సరికాదని హితవు పలికారు. గతంలో వైఎస్సార్ హయాంలో జీవో నెంబర్ 938 ని విడుదల చేసి... ఆయనే రద్దు చేశారని గుర్తు చేశారు. తాజాగా 2430 జీవో జారీ చేసి తండ్రి కంటే మొండిగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం వైఖరి మార్చుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. జీవో రద్దు చేసే వరకు పార్టీ తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిరంకుశ పాలనతో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని ఆయన ఆక్షేపించారు.
ఇవీ చూడండి-ఇసుక... ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుంది..!
Intro:Body:Conclusion: