ETV Bharat / city

రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోంది: రామానాయుడు - palakollu mla

పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్​ ఇన్​ చీఫ్​ పదవి నుంచి వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తెదేపా తప్పుబట్టింది. సమర్థవంతమైన అధికారులను, నవయుగ వంటి ప్రతిష్ఠాత్మక గుత్తేదారులను తొలగిస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

నిమ్మల రామానాయుడు
author img

By

Published : Aug 29, 2019, 6:08 PM IST

సమర్థవంతమైన అధికారులను వైకాపా ప్రభుత్వం పక్కన పెడుతోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న వెంకటేశ్వరరావును ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించటం అన్యాయమని అన్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి విశేష సేవలు అందించిన వ్యక్తిని పక్కన పెట్టడం సరికాదని ఆక్షేపించారు. పైరవీలు చేసే అధికారులే వైకాపా ప్రభుత్వానికి కావాలని ఆయన ఆరోపించారు. నాణ్యమైన పనులు చేసే నవయుగ, ఎల్‌ అండ్‌ టీ, త్రివేణి వంటి గుత్తేదారులను, నాణ్యమైన ఇంజినీర్లను తొలగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. అసమర్థ గుత్తేదారుల వల్ల నాణ్యత లోపిస్తే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడి గోదావరి జిల్లాలపై పడితే సముద్రంలో కలిసే పరిస్థితి ఏర్పడుతుందని రామానాయుడు దుయ్యబట్టారు. పోలవరం సురక్షితంగా ఉంటేనే ఉభయగోదావరి జిల్లాలు బాగుంటాయని.. నాణ్యతపై రాజీపడితే రెండు జిల్లాల్లో ప్రాణ, ఆస్తినష్టం జరిగే అవకాశముందని పేర్కొన్నారు.

మీడియాతో నిమ్మల రామానాయుడు

Intro:Ap_Nlr_02_29_Sports_Day_Minister_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
క్రీడలను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో క్రీడాకారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. దాదాపు 350 మంది క్రీడాకారులకు పురస్కారంతోపాటు నగదు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్, సింహపురి స్పోర్ట్స్ పౌండేషన్ చైర్మన్ ద్వారకనాథ్ పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం తోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. నెల్లూరులో మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.