ETV Bharat / city

గుంటూరు పూల మార్కెట్​లో వినియోగదారుల సందడి..

author img

By

Published : Aug 19, 2021, 6:42 PM IST

కరోనా కారణంగా ఏడాదికి పైగా నష్టాలు చూస్తున్న పూల వ్యాపారులకు శ్రావణ మాసంతో మంచిరోజులొచ్చాయి. రేపు వరలక్ష్మి వ్రతం కావటంతో పూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరుణంలో ప్రజలు పెద్దఎత్తున మార్కెట్​కు తరలివచ్చి పూలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పూల మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది.

Guntur Flower Market
గుంటూరు పూల మార్కెట్
గుంటూరు పూల మార్కెట్

పెళ్లిళ్లు, పండుగలు, పూజలు.. ఇలా కార్యక్రమం ఏదైనా సరే పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే కొవిడ్ కారణంగా గతేడాది నుంచి శుభకార్యాలు పెద్దగా జరగటం లేదు. వరుసగా రెండు సంవత్సరాలు పెళ్లిళ్ల సీజన్​ను కరోనా మింగేసింది. ప్రస్తుతం కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టినందున ప్రజలు తిరిగి పండుగలు, శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు. దీంతో పూల మార్కెట్లు మళ్లీ ఊపందుకున్నాయి.

శ్రావణ మాసం ప్రారంభం కావటంతో ప్రతి ఇంటా పూజలు మొదలయ్యాయి. అలాగే పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో వివాహాలు జరుగుతున్నాయి. రేపు శ్రావణ మాసం రెండో శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కావటంతో పూలకు గిరాకి పెరిగింది. గుంటూరు పూల మార్కెట్లో కొనుగోలుదారులతో సందడి కనిపించింది. వరలక్ష్మి వ్రతం పూజల కోసం పూలు కొనుగోలు చేసేందుకు జనం బాగానే వస్తున్నారని వ్యాపారాలు చెబుతున్నారు. బంతులు, చేమంతులు, గులాబీలు, మల్లెలు, జాజులకు డిమాండ్​ ఎక్కువగా ఉందంటున్నారు.

కొనుగోళ్లు బాగానే ఉన్నా లాభాలు లేవని, మనుపటి కంటే తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. మరో వైపు పూల ధరలు ఎక్కువగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. పండుగ తప్పనిసరి కావటంతో ధరలు ఎక్కువైనా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

మార్కెట్​కు భారీగా జనం రావటంతో భౌతిక దూరం కరువైంది. మాస్కులు ధరించినప్పటికి జనం కిక్కిరిసి ఉండటం ఆందోళన కలిగించింది.

ఇదీ చదవండీ.. CBN: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.