Police caught a gang of thieves: ఉదయం పూట ప్రపంచానికి వారు చెత్తను సేకరించేలా కనబడుతారు.. రాత్రైతే చాలు వారి అసలు రంగు బయటపడుతుంది. మెుదట ఆయా ప్రాంతాల్లో తాళం వేసిన ఇంటిని పరిశీలించి.. అటుపై చోరీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా పశ్చిమ బంగాల్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. చోరీలు చేసే సమయంలో ఖరిదైన లాడ్డిలో బస చేస్తారని వెల్లడించారు. చేత్త సేకరిస్తున్నట్లుగా ఎవ్వరికీ అనుమానం రాకుండా రెక్కీ నిర్వహిస్తారని.. తాళం వేసిన ఇళ్ల సమాచారాన్ని తమ ముఠా సభ్యులకు తెలియజేసి. వారంతా కలిసి రాత్రిళ్లు దోపిడీకి పాల్పడుతారని తెలిపారు.
ఇలా ఇప్పటివరకు వీరిపై గుంటూరులో నాలుగు కేసులు నమోదుకాగా.. పశ్చిమ బంగాల్లో సైతం కేసులు వెలుగు చూసినట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.25.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వెల్లడించిన గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. పోలీసులకు అనుమానం రాకుండా రాష్ట్రాల్ని మార్చి దొంగతనాలకు పాల్పడతున్నారని ఎస్పీ చెప్పారు.
ఇవీ చదవండి: