పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 16న పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. గుంటూరు శానిటేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఒప్పంద కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ నేడు ఒప్పంద కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్లో కలపడం దారుణమన్నారు. దీనివల్ల వారికి వచ్చే పీఎఫ్, ఈ.ఎస్.ఐ తదితర బెనిఫిట్స్ పోవటంతో పాటు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. తమ సమస్యలు పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగ సంఘాలు అన్నీ ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఈనెల16న డీఎంఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని తెలిపారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే 26న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొని ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..