ETV Bharat / city

కొత్తగా ఆలోచించే వారికే భవిష్యత్తులో అవకాశాలు: శైలజాకిరణ్​

కొత్తగా ఆలోచించే వారికే భవిష్యత్తులో అవకాశాలుంటామని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్​వీఆర్​ జేసీ ఇంజినీరింగ్ కళాశాల 35వ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు పరిధి దాటి ఆలోచించాలని సూచించారు.

sailaja kiran on students
విద్యార్థులకు శైలజా కిరణ్​ సూచనలు
author img

By

Published : Feb 29, 2020, 5:20 PM IST

విద్యార్థులకు శైలజా కిరణ్​ సూచనలు

ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత వేగంగా మారుతోందని... అందుకు తగ్గట్లుగానే విద్యార్థులు తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ సూచించారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్​వీఆర్​ జేసీ ఇంజినీరింగ్ కళాశాల 35వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఆలోచించే వారికి మాత్రమే భవిష్యత్తులో అవకాశాలు బాగుంటాయన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థుల పరిధి దాటి ఆలోచించాలని సూచించారు.

పరిశ్రమకు అవసరమైన అంశాలను గుర్తించాలని... సమస్యలు పరిష్కరించే నైపుణ్యం పెంచుకోవాలని శైలజాకిరణ్​ అన్నారు. స్మార్ట్ ఇండియా హాకథాన్ వంటి కార్యక్రమాలు ఈ దిశగా ఉపయోగపడతాయన్నారు. నలుగురితో కలిసి సమష్టిగా ఆలోచించటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శైలజాకిరణ్​ ప్రోత్సాహకాలు అందజేశారు.

ఇదీ చదవండి:

రూ.3,309 కోట్ల బడ్జెట్​కు తితిదే బోర్డు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.