ETV Bharat / city

VIVEK YADAV : 'రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది' - guntur crime

గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. ఘటన విషయంలో ప్రభుత్వం స్పందించి, త్వరితగతిన చర్యలు చేపట్టినందుకు రమ్య తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
author img

By

Published : Aug 19, 2021, 2:37 AM IST

ఇటీవల హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్ భరోసా ఇచ్చారు. రమ్య తల్లిదండ్రులు బుధవారం కలెక్టర్‌ను కలిశారు. ఘటన విషయంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన చర్యలు చేపట్టినందుకు రమ్య తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, ప్రభుత్వం తమ కుటుంబానికి మానసికంగా అన్ని విధాలా అండగా ఉందని వారు తెలిపారు. పదిలక్షల ఆర్ధిక సహాయం అందించారన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం ఆదేశాల మేరకు కుటుంబానికి నివాస స్థలం, వ్యవసాయ భూమి, పెద్దకుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

ఇదీచదవండి.

KRMB : శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.