బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. బిడ్డ మొదటి 1000 రోజులు సంరక్షణ, వారి పోషణ మొదలైన అంశాలను వివరించేందుకు గుంటూరు సర్వజనాస్పత్రిలో పోషణ మిత్ర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. జీజీహెచ్ సుశ్రుత హాలులో స్త్రీ-శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడ పిల్లల పుట్టుకే వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపిల్లలకు జన్మించిన తల్లులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జేసీ ప్రశాంతి మాట్లాడుతూ... ఆడపిల్లల సంరక్షణతో పాటు చదువు కూడా ముఖ్యమన్నారు. చిన్న చిన్న ఒడుదొడుకులు ఎదురైనా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెళ్లి చేసి పంపించి తమ బాధ్యత తీరిపోయిందని తల్లిదండ్రులు అనుకోవడం సరికాదన్నారు. ఆడపిల్లలను పెంచి పోషించి వారిని గొప్పస్థానంలో ఉంచినప్పుడే ఆడపిల్ల పుట్టక వేడుక అవుతుందన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ప్రభావతి, స్త్రీ,శిశు అభివృద్ధి సంస్థ పిడిమనోరంజని, వైద్యులు, మహిళలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: