పోలీసు సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేస్తున్నామని... ప్రజల కోసమే పోలీసులు పని చేస్తున్నారని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఉద్ఘాటించారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండులో ఆర్.ఎం. రాఘవకుమార్తో కలిసి పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించిన ఎస్పీ అమ్మిరెడ్డి... ప్రయాణికులకు భద్రత కల్పించడం అవుట్ పోస్టు లక్ష్యమని చెప్పారు. ప్రయాణంలో ఉండగా ఎవరైనా ఆపదలో ఉన్నా.. సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదు చేసే ప్రయాణికులకు ఎఫ్ఐఆర్ కాపీ సైతం అందిస్తామన్నారు. అవుట్ పోస్టు మినీ పోలీస్ స్టేషన్లా పని చేస్తుందని ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు.
ఇదీ చదవండీ... ప్రలోభాలకు లోనై.. పార్టీకి ద్రోహం: చంద్రబాబు