వైకాపా లాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు తెదేపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఘోర వైఫల్యం చెందిందన్నారు. వైకాపాకు ఎందుకు ఓటేశామని అధికార పార్టీ నాయకులే తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి నేతను వదులుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి జరిగినా... అసత్య వార్తల వల్లే ఓటమి చవిచూశామని అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని పుల్లారావు సూచించారు.
ఇదీ చదవండి