ETV Bharat / city

మాస్క్‌ మాత్రమే కరోనా నుంచి కాపాడగలదు..!

author img

By

Published : Apr 18, 2021, 6:25 AM IST

కరోనా కేసులు, మరణాల సంఖ్య... ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. నిండుతున్న ఆసుపత్రులు, వ్యాక్సిన్‌ కొరత... ప్రతికూలతలను గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుతానికి మాస్క్‌, శానిటైజర్‌, స్వీయనియంత్రణే కరోనాపై అస్త్రాలు. అయినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడట్లేదు. పోలీసులు, అధికారులు ఆపి ప్రశ్నిస్తే గానీ మాస్క్‌లు పెట్టుకోవట్లేదు.

మాస్క్‌
మాస్క్‌
మాస్క్‌, శానిటైజర్‌, స్వీయనియంత్రణే కరోనాపై అస్త్రాలు

"ఆనందాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఎంతమూల్యానికి? మాస్క్‌ లేకుండా జనాల మధ్య తిరగటం కరోనా వ్యాప్తికి కారకం. ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం" వంటి ప్రకటన థియేటర్‌లోనే వేసినా ప్రజలు మాస్క్‌ పెట్టుకుని సినిమా చూసే పరిస్థితి కనిపించట్లేదు. వైరస్సే కదా ఏం చేస్తుందిలే అన్న నిర్లక్ష్యంతోనే రోడ్లు, మార్కెట్లలో తిరిగేస్తున్నారు. దుకాణాల్లో సరకులు కొంటున్నారు. రోడ్డుపక్కనే ఉన్న ఫుడ్‌కోర్టుల్లో తినేస్తున్నారు. చుట్టుపక్కలవాళ్లు ప్రశ్నిస్తే గానీ.. మాస్క్‌ ఒకటి పెట్టుకోవాలన్న స్పృహే లేకుండా కొందరు గడిపేస్తున్నారు.

కరోనాతో రాష్ట్రంలో ఇప్పటికే 7 వేల మందికిపైగా మరణించారు. తీవ్రత ఇంత భారీస్థాయిలో ఉన్నప్పటికీ ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు. సినిమా థియేటర్ల వద్ద మాస్క్‌లు ధరించట్లేదు. శానిటైజర్లు అందుబాటులో పెడుతున్నా వినియోగించట్లేదు. వినోదం మాటున పొంచిఉన్న ప్రమాదాన్ని తేలికగా తీసుకుంటున్నారు. అభిమానులు గుంపులుగా చేరి థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. 100 శాతం సిట్టింగ్‌తో భౌతికదూరం ఉండదని తెలిసినా.. మాస్క్‌ పెట్టుకుని చూసేందుకు ప్రయత్నించట్లేదు. ఈ నిర్లక్ష్యమే ఇంటిల్లిపాదీ కరోనా బారిన పడటానికి కారణమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మాస్క్‌ మాత్రమే కరోనా కట్టడిలో కీలకపాత్ర పోషించిందని డబ్ల్యూహెచ్​వో మొదలుకుని... అంతర్జాతీయ పరిశోధన సంస్థలూ చెబుతున్నాయి. ప్రభుత్వాలు మాస్క్‌లు పెట్టుకోవాలని కఠిన ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ ప్రజలు అశ్రద్ధ చేయటంతో... పోలీసులే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మాస్క్‌ లేకుండా రోడ్లమీదకు వచ్చినవారిని ఆపి ప్రశ్నిస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. కొంతమంది పోలీసులు... జరిమానా విధించిన డబ్బుతోనే మాస్క్‌ కొనుగోలు చేసి ఇస్తున్నారు.

జరిమానాలూ ప్రజల్లో మార్పు తీసుకురావట్లేదు. 60 శాతం మంది మాత్రమే జాగ్రత్తలు పాటిస్తున్నారు. నడివయస్కులు జాగ్రత్తలు పాటిస్తుండగా.. యువత నిబంధనలను పట్టించుకోవట్లేదని పోలీసులు చెబుతున్నారు. తాము కనిపించినప్పుడు మాస్క్‌ పెట్టుకుని... వెళ్లిపోయాక తీసేస్తున్నారని వెల్లడించారు. ఐపీసీ సెక్షన్‌ 188 సహా పలు కేసులు నమోదు చేసి శిక్షిస్తే తప్ప ప్రజల్లో మార్పు వచ్చేలా కనిపించట్లేదని హెచ్చరిస్తున్నారు. పది నుంచి వంద మంది వరకూ ప్రజలు సమూహంగా ఉండే దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలే... తమ వద్దకు వచ్చే వ్యక్తులు కచ్చితంగా మాస్క్‌ ధరించేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 7,224 కేసులు, 15 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.